Home Page SliderTelangana

అధికారం లేకపోతే కేసీఆర్‌కు నిద్రపట్టదు: బండి సంజయ్ కుమార్

తెలంగాణ: అధికారం లేకపోతే కేసీఆర్ కుటుంబం బతకలేకపోతోందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. వరి వేస్తే ఉరి అన్న వ్యక్తి రైతులపై ప్రేమ కురిపిస్తున్నారని ఈ రోజు అదిచూస్తే విడ్డూరమనిపిస్తోంది. రైతులను డీఫాల్టర్లుగా మార్చిందే కేసీఆర్ అని మండిపడ్డారు. గతంలో వర్షాలకు రైతులు నష్టపోతే రూ.10 వేలు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కలవని వ్యక్తి కనీసం ఇప్పుడైనా కలుస్తున్నారని ఇప్పుడు ఓటర్లు కావాల్సి వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.