ఏప్రిల్ 13న బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ
తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు పెద్ద యెత్తున ప్రజలను తరలించి విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. కాగా చేవెళ్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ నుండి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో నిలిచారు.