Home Page SliderTelangana

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు!

హైదరాబాద్: వేసవి ధాన్యం కొనుగోలుకు జిల్లాల వారీగా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 7,149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గత వానాకాలం, వేసవి సీజన్లో కొనుగోలు చేసిన ప్రదేశాల్లోనే ఈసారి ఏర్పాటు కానున్నాయి. ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలపై చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.