Andhra PradeshHome Page Slider

ఈనెల 16, శనివారం వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

దేశంలో లోక్ సభ, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రేపోమాపో రానున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నెల 16న ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇప్పటికి సమన్వయకర్తల పేరుతో 12 జాబితాలను విడుదల చేసిన ఆ పార్టీ పూర్తి జాబితాలను విడుదల చేయనుంది. 102 సార్లు అభ్యర్థుల్ని మార్చింది. పలు నియోజకవర్గాల్లో రెండు, మూడు సార్లు కూడా అభ్యర్థులను పార్టీ మార్చింది. సమన్వయకర్తల నియామకంతో ఒకటి, రెండు చోట్ల తప్పించి అభ్యర్థుల్ని మార్చే అవకాశం లేదని ఇటీవల సీఎం జగన్ కూడా తేల్చి చెప్పారు. టికెట్లు కేటాయించిన తర్వాత ఉత్తరాంధ్ర నుంచి జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.