నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్
జనసేన ముఖ్యనేత కందుల దుర్గేష్ కు పార్టీ నిడదవోలు సీటు ఖరారు చేసింది. వాస్తవానికి ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ అందుకు పార్టీ ఆమోదం తెలిపినప్పటికీ… సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ససేమిరా అనడంతో చివరాకరకు కందుల దుర్గేష్ ను పార్టీ నిడదవోలు అభ్యర్థిగా ప్రకటించింది. జనసేన ఆరంభం నుంచి కందుల దుర్గేష్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. కార్యకర్తల్లో ఆయన మంచి గుర్తింపు ఉంది. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తర్వాత పార్టీ ముఖ్యనేతగా కందుల దుర్గేష్ ఉన్నారు.

కందుల దుర్గేష్, గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. 2007-2013 వరకు ఎమ్మెల్సీగా వ్యవహరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నికల్లో 42,685 ఓట్లు సాధించారు.

