Home Page SliderTelangana

లోక్ సభకు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

లోక్ సభకు పోటీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పలువురు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఇప్పటికే కొందరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్న పార్టీ తెలంగాణ అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేసింది. ముందుగా అనుకున్నట్టుగా మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, చేవెళ్ల నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, మెదక్ నుంచి నీలం మధుముదిరాజ్, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిత్వాలు ఖరారైనట్టు తెలుస్తోంది.

ఇక నల్గొండ నుంచి జానా రెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, రమేష్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మల్కాజ్‌గిరి నుంచి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి/మైనంపల్లి హనుమంతరావు మహబూబాబాద్ నుంచి బలరామ్ నాయక్, విజయాబాయి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి కాని పక్షంలో ఈరవత్రి అనిల్, సునీల్ రెడ్డిలలో ఒకరికి అవకాశం ఇవ్వనున్నారు. కరీంనగర్ సీటు ప్రవీణ్ కుమార్ రెడ్డి, వెలిచర్ల రాజేందర్రావుల్లో ఒకరికి దక్కనుంది.

ఆదిలాబాద్ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేకు అవకాశమిస్తారా వెడ్మ బొజ్జుకు అవకాశమిస్తారా.. లేదంటే గత ఎన్నికల్లో ఓడినవారిలో ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా అన్నది చూడాలి. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, వరంగల్ కోసం అద్దంకి దయాకర్ ఇద్దరూ పోటీపడుతున్నారు. పెద్దపల్లి ఎంపీగా ఎమ్మెల్యే వివేక్ తనయుడు గడ్డం వంశీకి అవకాశమివ్వాలని భావిస్తున్నప్పటికీ… ఆయనపై స్థానిక నేతల వ్యతిరేక ఇబ్బందికరంగా మారింది. ఇక ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పోటీ పడుతుంటే.. ఎవరికి సీటివ్వాలన్నదానిపై పార్టీ మల్లగుల్లాలుపడుతోంది.