కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత
పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ ముఖ్యనేత కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు వెంకటేష్ నేత. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుంచి ఒడిన కొప్పుల ఈశ్వర్ ను బీఆర్ఎస్ హైకమాండ్ పెద్దపల్లి నుంచి పోటీ చేయిస్తోందన్న వార్తల నడము వెంకటేష్ నేత, కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు.

