Home Page SliderTelangana

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్

రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడంతో డిసెంబర్‌లో ఇతర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రమాణం చేయలేకపోయారు. కేసీఆర్ ప్రమాణస్వీకారం సందర్భంగా పెద్ద ఎత్తున గులాబీ నేతలు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ నేతలు టి హరీష్ రావుతో పాటు పలువురు సమక్షంలో ఆయనతో ప్రమాణం చేయించారు. కేసీఆర్ ఇప్పటికే BRSLP నాయకుడిగా ఎన్నికయ్యారు. తదుపరి బడ్జెట్ సెషన్‌లో ఆయన బీఆర్‌ఎస్‌ఎల్‌పీకి నాయకత్వం వహిస్తారు. కేసీఆర్ ప్రమాణస్వీకార సమయంలో… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దగ్గరుండి సంఘీభావం తెలిపారు.