Home Page SliderInternational

రోహన్ బోపన్న సంచలనం… 43 ఏళ్ల వయసులో గ్రాండ్ స్లామ్ టైటిల్

ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయంతో రోహన్ బోపన్న చరిత్ర సృష్టించారు. గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్న అత్యంత వయోవృద్ధుడుగా నిలిచాడు. మాథ్యూ ఎబ్డెన్‌తో జత కట్టి ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా రోహన్ బోపన్న అద్భుతం ఆవిష్కరించాడు. ఈ ఏడాది మార్చిలో 44వ ఏట అడుగుపెట్టనున్న బోపన్న శనివారం మెల్‌బోర్న్‌లో టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా పురుషుల డబుల్స్ చరిత్రలో అత్యంత వయో వృద్ధ నంబర్‌వన్‌గా నిలిచాడు. రెండో సీడ్‌లు రాడ్ లావర్ ఎరీనాలో 7-6 (7/0), 7-5తో అన్‌సీడెడ్ ఇటాలియన్ జోడీ సిమోన్ బోలెల్లి, ఆండ్రియా వవాస్సోరిపై విజయం సాధించారు. ఇది జట్టుగా వారి తొలి టైటిల్.