పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
పునాదిరాళ్ల నుంచి ప్రారంభమైన మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం రేపటి విశ్వంభరదాక విజయవంతంగా సాగుతోందన్నారు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రక్తదానం, నేత్రదానం ద్వారా కోట్లాది మంది గుండెల్లో చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. చిరంజీవిని ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డు వరించిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రితోపాటుగా సినీ నిర్మాత దిల్ రాజు చిరంజీవిని కలిసి అభినందించారు.


