వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
వైసీపీకి రాజీనామా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఆయన రాజీనామా చేస్తారంటూ వార్తలు వచ్చాయి. ఆయన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. పార్టీలో నెలకొన్న పరిణామాలు నచ్చక రాజీనామా చేసినట్టు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. పార్టీలో అనిశ్చితి తన వల్ల రాలేదని.. తాను అందుకు బాధ్యుడ్ని కానని ఆయన చెప్పారు. నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎంతగానో పనిచేశానని ఆయన తెలిపారు. సీఎం జగన్ సూచించినట్టుగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేనన్నట్టుగా తెలుస్తోంది.

