సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణం, దేశ చరిత్రలోనే భారీ స్కామ్: అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణమన్నారు భారీ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్వతంత్ర భారత దేశంలో ఇంతటి భారీ కుంభకోణం చూడలేదన్నారు. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. 2014 లో మరో 14వందల కోట్లు ఖర్చు చేస్తే అయిపోయే ప్రాజెక్టు పదేళ్లు అయినా పూర్తి కాలేదన్నారు. కానీ 7500 కోట్లు అదనంగా ఖర్చు చేశారన్నారు. 3 లక్షలకు పైగా ఆయకట్టుకు నీళ్ళు అప్పుడే వచ్చేది…కానీ ఇప్పటికీ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. సీతారామ ప్రాజెక్టుకు 18వేల కోట్లు ఖర్చు చేశారని… రెండు మూడు రోజుల్లో సీతారామ సాగర్ విజిట్ చేసి నిజాలు నిగ్గు తేల్చుతామన్నారు.

మంత్రుల బృందం ఫీల్డ్ విజిట్ చేస్తామన్నారు. రోజు రోజుకు బయట పడుతున్న వివరాలను చూసి దిగ్భ్రాంతి కలుగుతోందన్నారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులే కావొచ్చు కానీ.. వివరాలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేబినెట్ లో చర్చించి వీటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పదేళ్ల BRS పాలనలో నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్క తెలంగాణకు తీసుకురాలేదని… పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టుకు సైతం సరైన ఫార్మాట్లో జాతీయ హోదా కోసం అప్లై చెయ్యలేదని దుయ్యబట్టారు. జాతీయ హోదా స్టేటస్ అనేది దేశంలో ఎక్కడా ఇవ్వలేదని… కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారన్నారు. నేషనల్ ప్రాజెక్టు స్టేటస్ ఇవ్వలేమని మంత్రి చెప్పారన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. KRMB కి ప్రాజెక్టులు అప్పగించడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు.

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల పై కేంద్రం చర్చలు జరిపిందని.. కానీ ప్రభుత్వం సమాధానం చెప్పలేదన్నారు. BRS వాళ్ళు చెప్పే మాటలు అన్నీ అబద్ధాలేని తేల్చి చెప్పారు. హరీష్ రావు స్టేట్మెంట్ లో నిజం లేదన్నారు. కృష్ణా వాటర్ గురించి BRS వాళ్లకు మాట్లాడే హక్కు లేదన్నారు. కృష్ణా వాటర్ వాట తగ్గించే BRS హయంలోనేనన్నారు. రాష్ట్రం అమూల్యమైన సంపద BRS పాలనలో వృధా అయిందన్నారు. 18వేల కోట్ల వడ్డీ, 9 వేల కోట్లు అన్పైడ్ బిల్ల్స్ ఇరిగేషన్ లో భారం మోపారన్నారు. ఏ ప్రాజెక్టు చూసినా పైసల కోసమే తప్ప నీళ్ళ కోసం కాదన్నారు. KRMB విషయంలో అసెంబ్లీలో చర్చించి నిర్ణయం ఉంటుందన్నారు. నిబంధనలు పాటించని అధికారుల పై చర్యలు తీసుకుంటామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ళ కోసమన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ 1681కోట్ల ప్రాజెక్టు మాత్రమేనన్నారు. 2014 నాటికి 7వందల కోట్లు ఖర్చు చేస్తే అయిపోయే ప్రాజెక్టని… రెండు ప్రాజెక్టుల 1552 కోట్లు ఖర్చు చేస్తే అయిపోయేవన్నారు. 3లక్షల 30వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులని… రిడిజైన్ చేసి…సీతారామ అని పేరు పెట్టీ రూ. 18, 500 కోట్లకు పెంచారన్నారు. సీతారామ ప్రాజెక్టు పేరుతో 22వేల 9వందల కోట్లు ఖర్చు చేశారన్నారు. 1500 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్‌కు రూ 22 వేల కోట్లు వ్యయం చేశారన్నారు. ఇప్పటికే రూ. 9 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇంతటి దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రజలు సహకరించాలన్నారు. దోపిడీ చూసి కడుపు తరుక్కుపోతోందన్నారు. భట్టి విక్రమార్క.

