NIESBUDలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నోయిడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ సంస్థ కాంట్రాక్టు పద్ధతిలో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీని ద్వారా కన్సల్టెంట్ సహా పలు విభాగాల్లో 152 ఖాళీలను భర్తీ చేయనుంది. అభ్యర్థులు డిగ్రీ-పీజీతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 9లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ను చూడగలరు.