Home Page SliderTelangana

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి

సౌత్ సూపర్ స్టార్ చిరంజీవి సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన పలు చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.సీఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్ భేటీ వెనుక అసలు ఉద్దేశమేంటన్నదానిపై సినీ ఇండస్ట్రీ పెద్దలు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌తో, మెగాస్టార్ చిరంజీవి సన్నిహిత సంబంధాలు నెరిపారు. వాస్తవానికి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగాను వ్యవరించారు. గతంలో కేంద్ర కేబినెట్ మంత్రిగానూ పనిచేశారు. 2019 తర్వాత ఆయన పూర్తి రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన ఏపీలో జగన్మోహన్ రెడ్డితోనూ, తెలంగాణలో కేసీఆర్‌తోనూ నాడు సఖ్యతగా ఉన్నారు. తాజాగా రేవంత్ రెడ్డితోనూ చిరంజీవి సన్నిహితంగా మెలగడం ద్వారా సినీ ఇండస్ట్రీకి మంచి జరుగుతుందన్న భావన సినీ పెద్దల్లో ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు సినీ పెద్దలతో రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయ్. దీంతో అటు చిరంజీవి, ఇటు రేవంత్ కలయిక సినీ ఇండస్ట్రీకి వరమన్న భావన కూడా వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉండగా, ఫిల్మ్ ఫ్రంట్‌లో, చిరంజీవి ‘మెగా 156’ అనే ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ తొలిసారి సంతకం చేసిన ఈ ఫాంటసీ చిత్రానికి ‘బింబిసార’తో దర్శకుడిగా పరిచయం అయిన వశిష్ట దర్శకత్వం వహించనున్నారు. ‘మెగా 156’ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి భారీ ఎత్తున తెరకెక్కించనున్నారు.