Andhra PradeshHome Page Slider

సంక్రాంతికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఛార్జీల దోపిడీ..

ఏపీ: సంక్రాంతి పండుగకు సొంతూరికి వెళ్లే ప్రయాణికుల నుండి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఛార్జీల రూపంలో అధిక మొత్తంలో దోచుకుంటున్నాయి. ప్రత్యేక రైళ్లలో సీట్లన్నీ ఫుల్ అయిపోవడం, బస్సులు కూడా బుక్ అయిపోవడంతో దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా.. వేలకు వేలు ఎడాపెడా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. నియంత్రణ లేకపోవడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.