Home Page SliderTelangana

ఇష్టానుసారం జీరోటిక్కెట్ల జారీ… ఆర్టీసీ అధికారుల తనిఖీలు

ఆధార్, ఓటర్ కార్డులపై తెలంగాణలో మహిళలకు జీరో బస్సు టిక్కెట్ల జారీ విషయంలో కండక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వారి ఇష్టానుసారం జీరో టిక్కెట్లు జారీ చేస్తున్నారు. ఒక చోటికి టిక్కెట్ ఇమ్మంటే మరో చోటికి ఇస్తున్నారు. అదేమని అడిగితే, మీరేం డబ్బులిస్తున్నారా అని అడుగుతున్నారు. ఎక్కువమందిని తీసుకెళ్తున్నట్లు సాక్ష్యాల కోసం ఇలా ఎక్కువ జీరో టిక్కెట్లు, అధిక దూరాలకు టిక్కెట్లు జారీ చేస్తున్నారు. దీనితో ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోంది. ఇలాంటి ఫిర్యాదులు గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో అధికంగా ఉన్నాయి. దీనితో ఆర్టీసీ యాజమాన్యం నివారణ చర్యలు చేపట్టింది. ముమ్మడిగా తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రభుత్వం మహాలక్ష్మి పేరిట గుర్తింపు కార్డును అందజేసే వరకూ ఆధార్, ఓటర్ కార్డులను అనుమతిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.  తనిఖీ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రయాణీకులు లేకుండా జీరో టిక్కెట్లు జారీ చేసినా, ప్రయాణీకులు ప్రయాణించే దూరం కంటే ఎక్కువ దూరానికి టికెట్ ఇచ్చినా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు.