రాష్ట్ర నీటిపారుదల శాఖలో కార్యదర్శి లేరా?
తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల శాఖలో కార్యదర్శి కొరత ఏర్పడింది. అసలు ఈ శాఖలో కార్యదర్శి ఉన్నారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. గతంలో ఈ పదవిలో పని చేసిన రజత్ కుమార్ పదవీ విరమణ చేశారు. దీనితో ఈ శాఖను స్మితా సబర్వాల్‌కు అప్పగించారు. కానీ ఆమె ఈ శాఖకు సంబంధించిన దస్త్రాలు చూడడం లేదు. ఎలాంటి మీటింగులకు హాజరవడం లేదు. కనీసం ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన మీటింగులకు కూడా ఆమె హాజరు కావడం లేదని అక్కడి అధికారులు తెలియజేస్తున్నారు.

