Andhra PradeshHome Page Slider

ఒకే కారులో టీడీపీ ముఖ్యనేత నారా లోకేష్, పీకే

ఏపీలో రాజకీయాలు మారుతున్నాయా? అంటే అవుననే అన్నట్టుగా సంకేతాలు వస్తున్నాయ్. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తాజాగా టీడీపీ ముఖ్యనేత నారా లోకేష్ తో కలిసి చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఏపీలో వైసీపీకి పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్, ఐప్యాక్ టీమ్ ఇప్పుడు ఎలా చేస్తుందన్నది చూడాల్సి ఉంది. ప్రశాంత్ కిషోర్, వ్యూహాలను అమలు చేయడంలో దిట్ట అన్న పేరు ఉంది. టీడీపీకి ఇప్పటికే అనేక మంది పనిచేస్తున్న సమయంలో ప్రశాంత్ కిషోర్ రోల్ ఎలా ఉండబోతుందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కేవలం చంద్రబాబును పరామర్శిస్తున్నారా.. లేదంటే రాజకీయంగా మరేదైనా ఉందా అన్నది తేలాల్సి ఉంది.