Home Page SliderNational

“దేశంలో న్యాయం ఎక్కడ దొరుకుతుందో అర్థం కావడం లేదు”:రెజ్లర్ వినేశ్ ఫోగట్

WFI ఛీఫ్‌గా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కాగా నిన్న WFI ఛీఫ్‌గా సంజయ్ సింగ్‌ను నియమించడంతో ఒలింపింక్ పతక విజేత,మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మరో మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ తాజాగా స్పందించారు. దీని గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. భారతదేశంలో మహిళా రెజ్లర్లపై వేధింపులు ఇకపై కూడా కొనసాగుతాయని  ఆమె వాపోయారు.అసలు ఈ దేశంలో న్యాయం ఎక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కాగా WFI ఛీఫ్ బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఏడాది నుంచి పోరాటం చేస్తున్న వారిలో వినేశ్ ఫోగట్ కూడా ఉన్నారు.