Home Page SliderNational

ఇండియా కూటమి నుండి ‘గాంధీ’ పేరును పక్కనపెట్టేస్తున్నారట

కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అట్టహాసంగా ఏర్పడిన ఇండియా కూటమి నుండి చివరికి గాంధీ కుటుంబాన్ని పక్కన పెట్టేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్న జరిగిన కూటమి సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ దళితనాయకుడైన మల్లికార్జున ఖర్గేను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు. దీనితో ఇండియా కూటమిలో అభిప్రాయ భేదాలు బయటపడ్డాయి. నితిష్, లాలూలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. నితిష్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనేది వీరి అభిప్రాయం. కానీ రాహుల్ గాంధీని మాత్రం ప్రధానిగా ఈ కూటమి ఒప్పుకోలేనట్లే తెలుస్తోంది. దీనితో బీజేపీని దళిత పీఎం పేరుతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గాంధీ కుటుంబ భక్తులకు మాత్రం ఇది మింగుడు పడడం లేదు. ఇంకా ఎన్నాళ్లు రాహుల్‌ను చిన్నవాడిగానే భావిస్తారని అనుకుంటున్నారు. సోనియా గాంధీ చాలాకాలం తెరవెనుక ఉండి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నడిపించినా ప్రత్యక్షంగా ప్రధాని పదవిని అలంకరించలేదు. దీనితో గాంధీ కుటుంబం అధికారానికి దూరమై 30 ఏళ్లు దాటింది. రాజీవ్ గాంధీ తర్వాత ఎవ్వరూ ప్రధానిగా లేరన్నది సత్యం. కాంగ్రెస్ కూటమిలో కేజ్రీవాల్, నితిష్ లాంటి వాళ్లు బరిలో ఉన్నా పూర్తి సభ్యుల మద్దతు వారికి లేదన్నది సత్యమే. ఒకవేళ అద్భుతం జరిగి, కాంగ్రెస్ కూటమి ఇండియా అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరుంటారో అనేది అయోమయంగా మారింది.