సికింద్రాబాద్ నుంచి మోదీ పోటీ చేస్తే.. ఆయనపై నేనే పోటీ చేస్తా: కేఏ పాల్
దేశవ్యాప్తంగా త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి, కేఏ పాల్‌కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉందన్నారు. దానికి ఉదాహరణ ఆసిఫాబాద్ ఓటర్లే అన్నారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఆసిఫాబాద్ లో మా కాండిడేట్ కి 2500పైగా ఓట్లు వచ్చాయన్నారు. బీజేపీ, జనసేన తెలంగాణలో పోటీ చేసిన జనసేనకు కనీసం డిపాజిట్ కూడా రాలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 25 స్థానాల్లో వంద, రెండు వందల ఓట్ల తేడాతో గెలిచిందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మూడు నెలల్లో నెరవేర్చుకుంటే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవలేదని ఆయన ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వచ్చి పోటీ చేసినా ప్రయోజనం ఉండదన్నారు. పార్లమెంట్‌లో అసలు 141 మంది ఎంపీలను బీజేపీ ఎలా సస్పెండ్ చేస్తుందని కేఏ పాల్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మోడీ గారు సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తే.. నేను మోదీ పైన పోటీ చేస్తానని కేఏ పాల్ మోదీకి సవాల్ విసిరారు . మోదీకి తెలుగోడి సత్తా ఏంటో చూపిస్తా చిత్తుచిత్తుగా ఓడిస్తా అన్నారు. మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన హామీని నిలబెట్టుకోలేదని కేఏ పాల్ మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

