Home Page SliderInternational

అమెరికాలో కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో కలకలం చోటు చేసుకుంది.కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కాన్వాయ్‌లోని ఓ కారును ఓ ప్రైవేట్ కారు ఢీ కొట్టింది.అయితే ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.కాగా అమెరికాలోని డెలావర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో అమెరికా అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘటనపై శ్వేతసౌధం తాజాగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.దీని ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడన్ అతని భార్య జిల్ డెలావర్‌లోని తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లినట్లు పేర్కొంది. అయితే అక్కడ డిన్నర్ ముగించుకొని బైడన్ దంపతులు ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్ వద్దకు వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు అమెరికా సీక్రెట్ వాహనాన్ని ఢీకొట్టిందని తెలిపింది. అనంతరం మరో వాహనాంపైకి కూడా దూసుకెళ్లేందుకు ప్రయత్నించిందని శ్వేతసౌధం వెల్లడించింది.అమెరికాలో మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడంతో శ్వేతసౌధం ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.