ప్రజావాణి కార్యక్రమానికి పోటెత్తిన ప్రజలు
మహాత్మా పూలే ప్రజా భవన్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే రేపు ప్రగతి భవన్ వద్ద ప్రజావాణి ఉంటుందని ప్రకటించారు. హామీ ఇచ్చినట్లే ప్రగతి భవన్‌కు ప్రజాభవన్ అని పేరుపెట్టారు. దీనిని క్రమం తప్పకుండా ప్రభుత్వాధికారులు, మంత్రులు పాటించాలని ఆదేశించారు. నేడు మహాత్మా పూలే ప్రజా భవన్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తమ సమస్యలను విన్నవించుకొన్నారు. జీహెచ్ ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్, ఆయుష్ శాఖ కమీషనర్ హరిచందన, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ లు ఈ ప్రజా వాణి హాజరైన వారినుండి పిటీషన్లు స్వీకరించారు. ఈ ప్రాజావాణి కార్యక్రమానికి హాజరైన వారికి తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. తిరిగి మంగళ వారం నాడు ప్రజా వాణి ఉంటుందని అధికారులు తెలియ చేశారు .

