ఆధార్ సేవల కోసం అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు..
ఆధార్ సేవల కోసం అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. సంబంధిత ఆపరేటర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు వారిని నియమించిన రిజిస్ట్రార్‌కు రూ.50 వేల జరిమానా విధిస్తామని లోక్‌సభలో ఓ ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానమిచ్చారు. ఈ అంశంపై UIDAI కి మెయిల్ లేదా 1947 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు.