విజయవాడలో వినూత్న రీతిలో అంగన్వాడీల నిరసన
తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని విజయవాడలో వినూత్న రీతిలో అంగన్వాడీల నిరసన చేపట్టారు. నేటితో వీరి సమ్మె మూడవరోజుకు చేరింది. ప్రభుత్వ పెద్దలే తమను అవమానకరంగా మాట్లాడుతున్నారంటూ ఆందోళనలు చేస్తున్నారు. విధుల నుండి తొలగిస్తున్నామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. చట్టానికి విరుద్దంగా తమను బెదిరిస్తున్నారని, సీఎం జగన్ తమ ఎమ్మెల్యేల నోళ్లు మూయించాలని డిమాండ్ చేస్తున్నారు. అంగన్ వాడీ కార్యకర్తలకు నిత్యం పోరాటాలే దిక్కుగా మారాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్ వాడీలకు పని లేదని, పనిలేక సమ్మెలు చేస్తున్నారని, మహిళలమని చూడకుండా అవమానిస్తున్నారని వారు కంప్లైంటు చేస్తున్నారు. తమతో చర్చలకు రావాలని, ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


 
							 
							