Home Page SliderInternational

ఐక్యరాజ్యసమితిలో గాజాపై కాల్పుల విరమణపై భారత్ ఓటు

ఐక్యరాజ్యసమితిలో గాజాపై కాల్పుల విరమణపై ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై  భారత్ ఓటింగులో పాల్గొంది. ఈ తీర్మానానికి అనుకూలంగా, కాల్పుల విరమణకే మొగ్గుచూపి, ఓటు వేసింది. ఐరాసలో అత్యవసర సమావేశంలో భాగంగా ఈజిప్టు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈమధ్యనే కాల్పుల విరమణ అంశాన్ని ఐరాస భద్రతా సమితిలో ప్రవేశపెట్టగా, అమెరికా తన వీటో అధికారంతో దానిని అడ్డుకున్న సంగతి తెలిసిందే. భారత్ కూడా చాలా పర్యాయాలు ఇజ్రాయెల్- పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల ఘర్షణ కాల్పుల విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఓటింగ్‌కు దూరంగా ఉంది. కానీ ఈసారి 193 సభ్యదేశాలకు గాను, కేవలం 23 దేశాలే ఓటింగుకు దూరంగా ఉన్నాయి. 153 దేశాలు ఈ కాల్పుల విరమణ విషయంలో అనుకూలంగా ఓట్లు వేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఇంత భారీ మెజారిటీ లభించడంతో ఈసారి ఈ తీర్మానానికి ఆమోదం లభించింది.