Home Page SliderTelangana

ఒక్కరోజు శ్రమపడి ఓటేస్తే 5 ఏళ్లు మీరు, మీ పిల్లలు హ్యాపీ…

హైదరాబాద్ ప్రజలు శాంతి ప్రేమికులు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చితే నగరంలో కేవలం 40-50 శాతం మాత్రమే ఓటింగ్ శాతం నమోదవుతోంది. దీన్ని మనం పెంచాలి, ఒక్కరోజు శ్రమ అనుకోకుండా ఓటేస్తేనే అది సాధ్యపడుతుంది. ముందుచూపుతో మేల్కొంటే 5 ఏళ్లు సుఖపడతారు మీరు, మీ పిల్లలు కూడా. ఓటర్లు బాధ్యతగా బయటకు వచ్చి ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి అని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య కోరారు. ఈ నెల 30న పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలు తదితర అంశాలపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.