Home Page SliderTelangana

ఏనుగు రవీందర్ రెడ్డికి మద్దతుగా బీర్కూర్‌లో ఎన్నికల ప్రచారం

బీర్కూర్: కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తోందని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్యాద్రిరెడ్డి పేర్కొన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డికి మద్దతుగా శుక్రవారం బీర్కూర్‌లోని పలు కాలనీల్లో తిరుగుతూ కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. నాయకులు చందు తదితరులు పాల్గొన్నారు.