Home Page SliderTelangana

బీజేపీ అభ్యర్థి రవీంద్రనాయక్‌ను ఆశీర్వదించమని కోరిన ఈటల

ఇల్లెందు: సీఎం కేసీఆర్ రైతుబంధు ఒక్కటి ఇచ్చి మిగిలిన పథకాలన్నీ బంద్ పెట్టాడని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం ఏర్పాటు చేసిన విజయ సంకల్ప యాత్ర సభలో మాట్లాడారు. సింగరేణి కార్మికులు చెల్లిస్తున్న ఆదాయ పన్నును రీయింబర్స్ చేసే అంశాన్ని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టిందని, సింగరేణి పురిటిగడ్డ ఇల్లెందు నుండి ఈమాట చెబుతున్నానన్నారు. బీజేపీ అభ్యర్థి రవీంద్రనాయక్‌ను ఆశీర్వదిస్తే కొమరారం, బోడు మండలాలను ఏర్పాటు చేస్తామని, ఇల్లెందు, డోర్నకల్, మహబూబాబాద్ రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ప్రజలారా మీరంతా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బీజేపీని గెలిపించాలని ప్రార్థన.