Home Page SliderTelangana

BJP గెలుపుతోనే కుటుంబపాలనకు చరమగీతం-కిషన్‌రెడ్డి

బోరబండ: బీజేపీ విజయంతోనే సోనియాగాంధీ, కేసీఆర్ కుటుంబాల పాలన అంతమవుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్‌రెడ్డికి మద్దతుగా రహ్మత్‌నగర్ డివిజన్ ఎస్‌పీజెడ్ హిల్స్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక జంట బొమ్మల కూడలిలో విశ్వకర్మ సంఘానికి చెందిన పలువురికి కండువాలు కప్పి బీజేపీలోకి చేర్చుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఎంఐఎం గెలిస్తే అభివృద్ధి ఆగిపోయి భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలు ఎక్కువౌతాయన్నారు. బీజేపీ జిల్లాల అధ్యక్షులు డా.ఎన్.గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.