పెద్దపల్లిలో విజేత నువ్వా-నేనా!?
పెద్దపల్లి నియోజకవర్గం ఈసారి రసవత్తరం పోరాటానికి వేదకవుతోంది. కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకోవడంతో ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది. బీజేపీ నుంచి ఇక్కడ దుగ్యాల ప్రదీప్ రావు పోటీ చేస్తున్నప్పటికీ… పోటీ ఆ రెండు పార్టీల మధ్యనే అన్న భావన ఉంది. 2014, 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి దాసరి మనోహర్ రెడ్డి విజయం సాధించారు. విద్యా వ్యాపార వేత్తగా నియోజకవర్గంలో పేరు సంపాదించుకున్న ఆయనకు గత కొన్నాళ్లుగా నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోందన్న ప్రచారం నడుము, ఈసారి తన గెలుపు నల్లేరుపై నడేకనని కాంగ్రెస్ నేత విజయరమణారావు భావిస్తున్నారు. అయితే గెలుపు ఓటములపై బీజేపీ ఏ మేరకు ప్రభావితం చూపుతుందో చూడాలి. పార్టీ కార్యక్రమాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించే దుగ్యాల ప్రదీప్ రావు బరిలో దిగారు. కాంగ్రెస్, బీఆఆర్ఎస్ రెండు పార్టీలను నిలువరించడమే లక్ష్యమని ఆయన అంటున్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి విజయరమణారావు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. దీంతో మరోసారి గెలుపుపై ఆయన దీమాతో ఉన్నారు.

పెద్దపల్లి పోలింగ్ బూత్‌ల సంఖ్య 290. పురుష ఓటర్లు 1,23,768. మహిళా ఓటర్లు 1,25,555 మంది కాగా ట్రాన్స్ జెండర్లు తొమ్మిది మంది ఉన్నారు. ఇక మొత్తం ఓటర్లు 2,49,332 ఉన్నారు. పెద్దపల్లిలో బీసీల జనాభా గణనీయంగా ఉంది. ఇక్కడ ఇతర బీసీ వర్గాల ఓటర్లు సుమారుగా 25 శాతం వరకు ఉన్నారు. పద్మశాలీలు 10 శాతానికి పైగా ఉన్నారు. ముస్లింలు సైతం 10 శాతం వరకు ఉన్నారు. ఇక గౌడలు తొమ్మిదిన్నర శాతం, మున్నూరుకాపు, గౌడలు ఏడు శాతానికి పైగా ఉన్నారు. తెనుగు-ముదిరాజ్ ఐదున్నర శాతం వరకు ఉండగా, మాలలు సైతం అంతే సంఖ్యలో ఉన్నారు. ఇతర ఓసీలు నియోజకవర్గంలో 5 శాతం, విశ్వబ్రహ్మణలు 4 శాతానికి పైగా ఉన్నారు. రెడ్డి ఓటర్లు సైతం మూడు శాతానికి పైగా ఉన్నారు. ఇతర ఓటర్లు సుమారుగా 9 నుంచి 10 శాత మేర ఉన్నారు.

