Home Page SliderTelangana

హామీల అమలులో బీఆర్‌ఎస్ పక్షపాతం

తూప్రాన్: రెండు పడక గదులు, బీసీ బంధు, దళితులకు మూడెకరాలు, కొత్త రేషన్ కార్డుల మంజూరులో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నేత, గజ్వేల్ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం తూప్రాన్‌లో నాయకులతో కలిసి  ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను రెండుసార్లు ఇక్కడి ప్రజలు గెలిపిస్తే, వారి అవస్థలను పట్టించుకోలేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామ్మోహన్‌గౌడ్, మహేష్ గౌడ్, సాయిబాబా గౌడ్ పాల్గొన్నారు.