Home Page SliderTelangana

బీజేపీ 4 జాబితా విడుదల, శేరిలింగంపల్లి నుంచి రవికుమార్ యాదవ్

బీజేపీ నాలుగో జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. ఇప్పటి వరకు మూడు జాబితాల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ తాజాగా కీలక స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. శేరిలింగంపల్లి నుంచి రవికుమార్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కృష్ణ ప్రసాద్, నాంపల్లి-రాహుల్ చంద్ర, మేడ్చల్ -రామచందర్ రావు, సంగారెడ్డి-పులిమామిడి రాజు, పెద్దపల్లి-ప్రదీప్ కుమార్ కు కేటాయించినట్టు బీజేపీ తెలిపింది. ఇంకా బీజేపీ 11 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. రాత్రికి పూర్తి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా బీజేపీ 8 స్థానాలను జనసేనకు కేటాయించింది.