Home Page SliderTelangana

ఈటలనే సీఎం, మోదీ వ్యాఖ్యల తర్వాత బీసీ సంఘాల ప్రెస్‌మీట్

మీరు ఈటలను గెలిపించండి.. నేను మీకు బీసీ ముఖ్యమంత్రిగా ఈటలను చేస్తానని హామీ ఇచ్చారు. బీసీ అంటే ఓబీసీ ముఖ్యమంత్రిగా ఈటలని మేం స్వాగతిస్తున్నాం.. అందరూ అన్ని కులాల వారు కూడా స్వాగతిస్తున్నారు. 33 బీసీ, కుల సంఘాలతో మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమైన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి ప్రకటన రావటం మాకు చాలా సంతోషదాయకం.. ఆనాడు ఎందరో మహానుభావులు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ, బీసీ ముఖ్యమంత్రి అనేది ఒక మోడీ పాలనలోనే, ఆ ఆలోచన రావటం సంతోషదాయకం.. ప్రధానమంత్రి మోడీజీ చేసిన బీసీ ప్రకటన ఒకటి, అందులో ఈటలని ముఖ్యమంత్రిని చేస్తాం అనటం స్వాగతించవలసిందే.

గోపి బోయ సంచార జాతుల అధ్యక్షులు
ఎక్కువ శాతం మంది బీసీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉంది.. అలాంటిది కచ్చితంగా మేం గెలిపించుకుంటాం.. అగ్ర కులాలకు పేదోడి బాధ తెలియదు.. అందుకే అన్ని కులాలవారు స్వాగతించి గెలిపించేలా పూనుకుంటాం. ఇలా సాగిన సభలో ఒక ఓబీసీ ప్రధానమంత్రి మోడీ అని చెప్పుకుంటూ వెళ్లే క్రమంలో తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే బీసీ సీఎం చేస్తాం అనటంలో మేం చాలా గర్వంగా ఫీలౌతున్నాము.. ఎన్నో ఏళ్ల నుండి ఒక్కసారి కూడా ఇటువంటి ప్రకటన ఏ ప్రభుత్వం చెయ్యలేదు.. బీజేపీ ప్రభుత్వం చేయగలిగింది కావున బీసీలంటే ఒక ఓటు బ్యాంకు కాదు, ఒక యంత్రం కాదు, చైతన్యంతో ముందుకెళ్లాలి.

పిట్ల నాగేష్ ముదిరాజ్ శక్తి సంఘం అధ్యక్షులు
బీసీ ఆత్మగౌరవ సభలో నరేంద్ర మోడీజీ మాట్లాడిన మాటలు వింటుంటే దీపావళి పండుగ నాలుగు రోజులు ముందే వచ్చినట్లుగా ఉంది.. ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి ప్రకటన రాలేదు.. అందుకే బీజేపీ ఒక అవకాశం ఇచ్చిందని.. మనం కూడా సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.. బీసీలను ఇంతవరకు అణగదొక్కే ఓటు బ్యాంకు గానే వాడుకున్నారు కానీ, ఒక్క బీజేపీ మాత్రం తెలంగాణ మొదటిసారిగా బీసీ మంత్రంతో సీఎం ప్రకటన చేశారు ఇది రాష్ట్రానికి క్షేమదాయకం. ఎందుకు ఈ విధమైన ప్రకటన చేశారంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికే.. బీసీ సీఎంగా ఈటల రాజేందర్‌ని ప్రకటించారు.. 130 కోట్ల అధిపతి ఒక ఛాలెంజ్‌గా తీసుకొని చెయ్యటం జరిగింది. బీఆర్ఎస్‌ వాళ్లు గాని, ఇటు కాంగ్రెస్‌కు వాళ్లుగాని బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అనే ప్రకటన చేయగలరా అంటూ సవాల్ విసిరారు.. కానీ వాళ్ళు ఏం చేయలేరు.. మాట్లాడలేరు… అందుకే అధికారం మనది అయితే మనదే రాజ్యం అవుతుంది.

జగన్మోహన్-హైకోర్టు అడ్వకేట్, నాగుల శ్రీనివాస్ యాదవ్, రామారావు, బీసీ సంఘాల నాయకులు
ఒక బీసీలపై అవగాహన ఉన్న వ్యక్తి సీఎంగా రావడమంటే తెలంగాణ బాగుపడుతుంది. కాబట్టి పెద్ద యెత్తున బీసీ వాళ్ళు ఓటును బీసీలకే వేద్దాం.. ఓల్డ్ సిటీలో చూస్తే ఒక్క ఎంఐఎం వాళ్ళు మాత్రమే గెలుస్తారు.. అలాగే తెలంగాణలో బీసీ ప్రకటనను స్వాగతిస్తూ మనకు వచ్చిన ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకొని ఒకసారి గెలిపిద్దాం.. బీజేపీ నుండి అత్యధికంగా ఎమ్మెల్యేలు గెలిస్తే కచ్చితంగా బీసీ సీఎంను చేస్తాననడం ఏమంత కష్టతరమైనది కాదు. మనకు ఇదొక సువర్ణావకాశం.. బడాబాబుల పాలన పోవాలి.. బీసీ పాలన రావాలి అంటే వచ్చిన ఒక అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కసారి బీజేపీకి మద్దతు తెలుపుదాం.. అగ్రకులాల వాళ్లలో కూడా పేదవాళ్ళు ఉన్నారు.. వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం ఖాయం. మోడీజీ విసిరిన సవాల్ తీసుకుని వేరే పార్టీవాళ్ళు కూడా బీసీ సీఎం ప్రకటన చేస్తే వాళ్లకు కూడా మద్దతు తెలుపుదాం.