Andhra PradeshHome Page Slider

విశాఖ సముద్రంలో నీటిని ఉంచుతారో? లేదో?: యామిని

విశాఖలో కొండలను దొలిచి ఆ ప్రాంత విధ్వంసానికి పాల్పడుతోన్న వైకాపా నేతలు.. మున్ముందు బే ఆఫ్ బెంగాల్‌లో నీటిని కూడా మిగులుస్తారో లేదో? అన్న అనుమానం కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ విమర్శించారు. మహిళలపై గౌరవం ఉన్నట్లు యాక్ట్ చేస్తున్న ముఖ్యమంత్రి మొదలు వైకాపా ప్రజా ప్రతినిధులు.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిపై ఎందుకు వ్యక్తిగత దూషణకు దిగుతున్నారని మండిపడ్డారు.