తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామే: కవిత
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అతి తక్కువ టైమ్లో తెలంగాణ సమ్మిళిత, సమగ్రాభివృద్ధి సాధించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో ముడోసారి విజయం సాధించడానికి ఇదే కీలక సమయమన్నారు. లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అభివృద్ధిలో ఆదర్శంగా తెలంగాణ అనే అంశంపై మంగళవారం కవిత కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో కేసీఆర్ అగ్రగామిగా నిలిపారని వివరించారు.