Andhra PradeshHome Page Slider

చంద్రబాబు పాలనలో అన్ని స్కామ్‌లే:సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఇవాళ ఎమ్మిగనూరులో పర్యటించారు.కాగా సీఎం ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు నాలుగో విడత డబ్బులను బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. సీఎం మాట్లాడుతూ..నాలుగేళ్ల నుంచి ఏపీ ప్రజలకు అండగా ఉంటున్నామన్నారు.కాగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి 99% హామీలను అమలు చేశామన్నారు. అయితే చంద్రబాబు పరిపాలనలో జన్మభూమి కమిటీలతో మొదలుపెడితే అమరావతి భూముల వరకు అన్ని స్కాములే జరిగాయని సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు స్కిల్ స్కామ్,ఫైబర్ నెట్ స్కామ్,మద్యం కొనుగోళ్లలో కూడా అవినీతికి పాల్పడ్డారని సీఎం తెలిపారు.ఈ విధంగా ఎక్కడబడితే అక్కడ స్కామ్ చేసి దోచేయడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకున్నది తినుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. చంద్రబాబు పాలనలో ఇది తప్ప ఇంకేమి కన్పించలేదన్నారు. కానీ ఈ నాలుగేళ్లలో అవినీతికి ఎక్కడా తావు లేకుండా రూ.2.38 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు.