తెలంగాణలో జనసేనతో పొత్తుపై క్లారిటీ రానుందా?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్ భేటి అయ్యారు. తెలంగాణ ఎన్నికలలో జనసేనతో బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో గతంలోనే 30 స్థానాలలో పోటీ చేస్తానంటూ ప్రకటించారు. కానీ ఇప్పుడు జనసేన తెలంగాణ ఎన్నికల బరిలో ఉంటుందా అనేది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణాలో పొత్తు ఉంటుందా? లేకపోతే బయటనుండి బలపరుస్తారా? అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క తెలంగాణలో టీడీపీ కూడా బరిలో ఉంటుందని టిడిపి పార్టీ ప్రకటించింది. దీనితో జనసేన ఏపీలో టీడీపీని బలపరిచినట్లే తెలంగాణలో కూడా బలపరుస్తుందా? అనేది ప్రశ్నగా మారింది. అయితే జనసేన అధ్యక్షుడు ఇలా బీజేపీకి, టీడీపీకి సపోర్టుగా గత ఎన్నికలలో కూడా తెలంగాణలో పోటీకి నిలపలేదు. దీనితో జనసేన కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ సారైనా తెలంగాణలో జనసేన పోటీలో ఉండాలని భావిస్తున్నారు.

