Home Page SliderNational

పవన్ గురించి మాట్లాడే పూర్తి హక్కు నాకే ఉంది..రేణు దేశాయి

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే పూర్తి హక్కు తనకు ఉందని ఓ నెటిజన్ ప్రశ్నకు జవాబుగా మండిపడ్డారు రేణు దేశాయి.  ఏది మాట్లాడాలో, మాట్లాడకూడదో అనేది పూర్తిగా తన స్వవిషయమని హెచ్చరించారు. పవన్‌తో తాను 11 ఏళ్లు కలిసి సంసారం చేశానని, తన ఇద్దరు పిల్లలకు ఆయన తండ్రి అని ఘాటు రిప్లై ఇచ్చారు. పవన్ గురించి ప్రశ్నలు ఇంటర్యూలలో అడగవద్దని చెప్పండని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీనికి జవాబుగా ఆమె ఇలా స్పందించారు. ఈ చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు రేణు దేశాయి. తాను ఏది మాట్లాడాలో, ఏది వద్దో నిర్ణయించడానికి ఎవరికీ అధికారం లేదన్నారు. వీరిద్దరూ బద్రి, జానీ అనే సినిమాలలో కలిసి నటించారు. బద్రి సూపర్ హిట్ అయినా, జానీ మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ సమయంలోనే వీరు ప్రేమవివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పవన్ మరో పెళ్లి చేసుకున్నా, రేణు మాత్రం పిల్లల బాధ్యత తీసుకుని వారిని చూసుకుంటున్నారు.