Home Page SliderTelangana

బస్తీమే సవాల్… గజ్వేల్‌లోనూ, హుజూరాబాద్… రెండు చోట్లా పోటీ చేస్తా

బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ బాంబు పేల్చారు. గతంలో గజ్వేల్ నుంచి బరిలోకి దిగుతానంటూ ప్రకటన చేసిన ఈటల తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌తోపాటుగా, హుజూరాబాద్ నుంచి సైతం తాను పోటీ చేస్తానని.. పార్టీ ఆదేశానుసారం వ్యవహరిస్తానంటూ తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలే హుజూరాబాద్‌లో కథనాయకులు కావాలని ఈటల పిలుపునిచ్చారు. వచ్చే రెండు నెలలపాటు కష్టపడితే భవిష్యత్ అంత సానుకూలంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి బరిలో దిగాలంటూ అక్కడ సబ్బండ వర్గాలు గత కొద్ది రోజులుగా కోరుతున్నాయ్. ఇటీవల ముదిరాజ్ గర్జనలో సైతం కార్యకర్తలు ఈటల రాజేందర్ గజ్వేల్ వస్తే గెలిపించుకుంటామంటూ నినదించారు. తెలంగాణలో అసలు ఆట మొదలవుతోంది.