పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ మరోసారి వ్యక్తిగత విమర్శలు
కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ మరోసారి తన స్థాయి మరిచి వ్యక్తిగత విమర్శలకు దిగారు. కాకినాడ జిల్లా సామర్లకోట సభలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, ఆయనను సమర్థించే నాయకులెవరూ ఏపీలో ఉండరు. ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా హైదరాబాద్‌లోనే. కానీ, ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3-4 ఏళ్లకోసారి మారిపోతూ ఉంటారు. ఒకసారి లోకల్.. ఇంకోసారి నేషనల్.. మరోసారి ఇంటర్నేషనల్. ఆడవాళ్లన్నా.. పెళ్లిళ్ల వ్యవహారాలన్నా.. పవన్‌కు గౌరవం లేదు అని జగన్ వ్యాఖ్యానించారు.