చంద్రబాబు నాయుడుకు స్వల్ప అస్వస్థత
రాజమండ్రి కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం, ఉక్క పోత కూడా ఎక్కువగా ఉండటంతో ఆయన తన గదిలో డిహైడ్రేషన్ కు గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన జైలు అధికారులకు తెలియజేయడంతో, అధికారులు వైద్యులకు సమాచారం అందించడంతో చంద్రబాబు ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.