Home Page SliderInternational

నీలిరంగు భవనాలతో ఇజ్రాయెల్‌కు ప్రపంచదేశాల మద్దతు

నీలిరంగు భవనాలతో ఇజ్రాయెల్‌కు ప్రపంచదేశాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. అకస్మాత్తుగా హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో భారీ ప్రాణనష్టానికి గురైన ఇజ్రాయెల్‌కు సంఘీ భావం ప్రకటిస్తున్నాయి కొన్ని దేశాలు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే దేశాలు హమాస్ నుండి ఇజ్రాయెల్‌ను రక్షించే ప్రయత్నాలకు మద్దతు నిస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనితో వాటికి మద్దతుగా తమ అధికారిక భవనాలకు, చారిత్రక కట్టడాలపై నీలం, తెలుపు రంగుల లైట్లను ప్రదర్మించాయి. అమెరికాలోని వైట్‌హౌస్, న్యూయార్క్ లోని ఎంపైర్ స్టేట్, బ్రిటన్‌లో ప్రధాని రిషి సునాక్ భవనం 10 డౌనింగ్ స్ట్రీట్, యూకే పార్లమెంట్ భవనం ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్, ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపేరా హౌస్ వంటి కట్టడాలపై ఇజ్రాయెల్ జెండాను, వాటి వర్ణాలైన నీలం, తెలుపుల రంగుల లైట్లను ప్రదర్శించారు. ఇజ్రాయెల్‌లోని చిన్నారులు, మహిళలు, సామాన్యపౌరులపై మారణహోమాన్ని ఖండిస్తున్నామని, ఉగ్రచర్యలను ప్రపంచమంతా ఖండిస్తోందని ఈ దేశాలు సంఘీభావం ప్రకటించాయి. ఇజ్రాయెల్ చర్యలకు అండగా ఉంటామని పేర్కొన్నాయి.