తెలంగాణాలో రేపో..మాపో పులి బయటకు వస్తుంది: మంత్రి కేటీఆర్
తెలంగాణాలో ఇవాళ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.అయితే దీనిపై తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు నవంబర్ 30న పోలింగ్..డిసెంబర్ 3న కౌంటింగ్..అంతా శుభ పరిణామమే.కాగా తెలంగాణాలో 3వ సారి కేసీఆర్ సీఎం అవ్వడం ఖాయమని కేటీఆర్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎం ప్రసంగం కోసం తెలంగాణా ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. అయితే రేపో..మాపో పులి బయటకు వస్తుంది. ఎగిరెగిరి పడుతున్న గుంటనక్కలు,తోడేళ్లన్నీ పారిపోవడం ఖాయం అన్నారు. తెలంగాణాలో రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డి తొర్రలకు పోవాల్సిందేనని కేటీఆర్ సెటైర్ వేశారు.