సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం
విశాఖలో సీఎం జగన్ చిత్రపటానికి అభిషేకం చేసి మహిళలు నిరసన తెలిపారు. ఆదివారం ఉదయం భారతీయ చైతన్య యువజన (బీసీవై) పార్టీ మహిళా విభాగం ఆర్కే బీచ్ రోడ్డులో పెద్దయెత్తున నిరసన ర్యాలీ తీశారు.
ఎంవిపి కాలనీ: విశాఖలో సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేసి మహిళలు నిరసన తెలిపారు. ఆదివారం ఉదయం భారతీయ చైతన్య యువజన పార్టీ మహిళా విభాగం ఆర్కే బీచ్ రోడ్డులో పెద్దయెత్తున నిరసన ర్యాలీ తీసింది. మహిళలు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. బూమ్ బూమ్ బ్రాండుల సృష్టికర్త.. రుషికొండను మింగిన అనకొండ.. జగనొస్తున్నాడు.. జాగ్రత్త అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తామన్న హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. ఈ క్రమంలో జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు. నిరసన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ కావడంతో పోలీసులు ఆ మహిళల గురించి ఆరా తీస్తున్నారు.

