త్వరలో OTTలోకి రానున్న బ్లాక్ బస్టర్ మూవీ
తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్,లేడి సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన చిత్రం జవాన్.ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదలై రూ.1100 కోట్ల కలెక్షన్ రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా OTT డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కాగా షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు నవంబర్ 2న ఈ సినిమాను ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారని సమాచారం. అయితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. మరి బాక్సాఫీసును కలెక్షన్లతో షేక్ చేసిన ఈ సినిమా OTT లో ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో వేచి చూడాలి.
