ఈ వారంలో యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభం
చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు విషయంలో అటు న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఇటు యువగళం పాదయాత్రతో మళ్లీ రోడ్ ఎక్కాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్ణయించారు. ఢిల్లీలో ఉండి న్యాయవాదులతో నిత్యం సంప్రదిస్తున్న ఆయన ఆదివారం పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫ్రె న్స్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ తదనంతర పరిణామాలపై చర్చించారు. యువగళం పున ప్రారంభం పై ముఖ్యనేతలతో చర్చించారు. ఈ వారం నుంచే యువగళం పాదయాత్ర ప్రారంభించే యోచనలో ఆయన ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడనుంచే యువగళం తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు కక్ష సాధింపు చర్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నేతలు అంతా ఇంటింటి ప్రచారం చేయాలని ఆయన శ్రేణులకు సూచించారు.