సీఐడీ కస్టడీకి టీడీపీ అధినేత చంద్రబాబు
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును రెండ్రోజులు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబును విచారించాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. న్యాయవాదుల సమక్షంలోనే చంద్రబాబును విచారించాలని ఏసీబీ కోర్టు సీఐడీని ఆదేశించింది. విచారణ అధికారుల పేర్లు ఇవ్వాలని కోర్టు సీఐడీని కోరింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు కోర్టు అనుమతించింది. విచారణ జరుపుతున్న వీడియో, ఫోటోలు విడుదల చేయొద్దని కోర్టు సీఐడీని ఆదేశించింది. ఆదివారం కస్టడీ ముగిశాక, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు చంద్రబాబును హాజరుపరచాలని పేర్కొంది.

