Home Page SliderTelangana

ఏపీ, తెలంగాణ విభజన తర్వాత సంబరాలేవీ, కాంగ్రెస్ తీరుపై మోదీ ధ్వజం

తెలంగాణ విభజన సరిగా జరగలేదు అంటూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల ఏర్పాటువల్ల రెండు రాష్ట్రాల్లో సంబరాలు జరగలేదన్నారు. 75 ఏళ్ల పార్లమెంటరీ జర్నీ – విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అభ్యాసాలు అనే అంశంపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో… ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ కొత్త రాష్ట్రాలు ఆవిర్భవించినప్పుడు ప్రతిచోటా వేడుకలు జరిగాయి. కానీ, తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్ నుండి వేరు చేయడంతో రెండు వైపులా “చేదు మాత్రమే” మిగిలిందన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను విభజించడం వల్ల రెండు రాష్ట్రాల్లో చేదు, రక్తపాతం మాత్రమే ఏర్పడిందన్నారు.

తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కారణమంటూ నిన్న హైదరాబాద్ లో జరిగిన సమావేశం నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావించాల్సిం ఉంటుంది. పాత పార్లమెంట్‌లో రాష్ట్రాలు ఏర్పాటయ్యాయనే విషయంపై బహుశా చివరిసారిగా మాట్లాడిన నరేంద్రమోడీ తెలంగాణ విషయాన్నే ప్రస్తావించి, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్‌ గానీ సంబరాలు చేసుకోలేదని, చేదు బీజాలు నాటాయని చెప్పారు.