Andhra PradeshHome Page Slider

హైకోర్టులో చంద్రబాబుకు పాక్షిక ఉపశమనం

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌కు సంబంధించిన అన్ని ప్రక్రియలను నిలిపివేయాలని ఏసీబీ కోర్టును ఏపీ హైకోర్టు ఆదేశించింది. రిమాండ్‌ను రద్దు చేయాలని హైకోర్టును కోరుతూ చంద్రబాబు తరపున లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలయ్యింది. చంద్రబాబు అరెస్టు చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదించారు.